విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి (State Higher Education Council Chairman Hemachandra Reddy) అన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్గత నాణ్యతా భరోసా కమిటీ (IQAC) వర్క్ షాప్లో ఆయన పాల్గొన్నారు.
నాక్(NAAC), ఎన్బీఏ(NBA) గుర్తింపు ఉన్న కళాశాలలను మాత్రమే కొనసాగిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలని.. సీఎం జగన్(CM Jagan) ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రమాణాలు పర్యవేక్షణకు క్వాలిటీ అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ రావు (State Higher Education Council Vice Chairman Professor Rammohan Rao) అధ్యక్షత వహించనున్నట్లు హేమచంద్రరెడ్డి తెలిపారు.
Higher Education Council Chairman: "విద్యాలయాల నాణ్యత ప్రమాణాలు మెరుగు పరచాలి" - ఐక్యూఏసీలో పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి
విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి సూచించారు. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్గత నాణ్యతా భరోసా కమిటీ (IQAC) వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన.. పలు సూచనలు చేశారు.
నాణ్యత ప్రమాణాలు మెరుగు పరుచుకోవాలి: హేమచంద్రరెడ్డి