తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి తెప్పోత్సవాలు 5 రోజులపాటు వైభవంగా జరిగాయి. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల మధ్య... వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారు... శ్రీదేవి, భూదేవి సమేతంగా కోనేటిలో ఏడుసార్లు విహరించారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న వేలాది మంది భక్తులు.... స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు.
తిరుమలలో ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు - tirumala news
తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజున స్వామివారు... శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు తరిలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.
Srivari Teppotsavam