సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సిద్ధమైంది. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలో మరమ్మతులు నిర్వహించి నీరు నింపడం ఆనవాయితీ వస్తోంది. వచ్చే నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పుష్కరిణి మరమ్మతు పనులు ప్రారంభించారు. నీటిని తొలగించి అడుగు భాగాన్ని శుభ్రపరచారు. తర్వాత పైపులకు మరమ్మతులు పూర్తిచేసి ఊట గుంటలను పరిశుభ్రపరిచారు. మరమ్మతులు పూర్తయ్యాక పుష్కరిణిలో పెయింటింగ్, ఇతర సివిల్ పనులను చేసి నీటిని విడుదల చేశారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీవారి పుష్కరిణి - శ్రీవారి పుష్కరిణి న్యూస్
శ్రీవారి బ్రహ్మోత్సవాలకి తిరుమల సిద్ధమవుతోంది. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకి ముందు పుష్కరిణికి మరమ్మతులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్కరిణిలోని నీటిని తోడి అడుగు భాగాన్ని పరిశుభ్రపరిచారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన శ్రీవారి పుష్కరిణి