తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే ఘనంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుత్మంతునిపై ఊరేగారు. తిరువీధుల్లో విహరించిన తిరుమలేశుడిని వేలసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. తమిళులకు పెరటాసి మాసం కావటంతో తమిళ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వాహనసేవలో పాల్గొన్నారు.
వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ - శ్రీవారి పౌర్ణమి గరుడవాహన సేవ
తిరుమలలో స్వామివారి పౌర్ణమి గరుడవాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడు...గరుత్మంతునిపై ఊరేగారు.
శ్రీవారి పౌర్ణమి గరుడవాహన సేవ