ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు...పెరిగిన భక్తుల రద్దీ ! - కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు...పెరిగిన భక్తుల రద్దీ !

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగుతుండగా...భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 30, 2019, 9:41 PM IST

కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. స్వామివారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద శేషవాహనంపై స్వామివారు ఊరేగుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.

పెరిగిన భక్తుల రద్దీ
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కూడా భక్తులు బారులుతీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా...టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఇప్పటివరకు శ్రీవారిని 37 వేల 876 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.66 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details