శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు(శ్రీవాణి) బ్రేక్ దర్శనం టికెట్లను బుధవారం నుంచి తితిదే అందుబాటులోకి తీసుకువస్తోంది. తితిదే వెబ్‌సైట్, యాప్‌లతో పాటు పరిమిత సంఖ్యలో తిరుమల జేఈవో కార్యాలయం నుంచి భక్తులకు టికెట్లు అందిస్తారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు చెల్లించిన భక్తుడికి తితిదే బ్రేక్ దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో జూన్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేశారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్, బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల సిఫారసు లేఖలపై భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నట్లు సమాచారం.
నేటి నుంచి శ్రీవాణి ట్రస్టు టికెట్లు - తిరుమల శ్రీవారి వార్తలు
శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. తితిదే వెబ్‌సైట్, యాప్‌లతో పాటు పరిమిత సంఖ్యలో తిరుమల జేఈవో కార్యాలయం నుంచి టికెట్లు అందిస్తారు.
నేటి నుంచి శ్రీవాణి ట్రస్టు టికెట్లు