చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈరోజు నుంచి 8 రోజులపాటు భక్తులకు స్వామివారు వివిధ రకాల వాహనాలలో దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం మీన లగ్నంలో ధ్వజారోహణం చేశారు.
![శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు srinivasa manga puram brahmotsawalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6069071-940-6069071-1581666932683.jpg)
ఘనంగా ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ప్రారంభమైన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల దృష్ట్యా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా వాహన సేవలతోపాటు మూలమూర్తిని దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేయాలని అధికారులకు ఈవో సూచించారు.
ఇదీ చదవండి : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం