ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుతూ... తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆరు నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని అన్నారు. ఈ మధ్య కాలంలో తితిదేపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనభాగ్యం కోసం తితిదే కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. కులం, మతం పేరుతో పవన్ కల్యాణ్ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కావాలనే తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీకాంత్‌రెడ్డి - srikanthreddy comments on pawan kalyan news
తిరుమల తిరుపతి దేవస్థానంపై కావాలనే కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారని... ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![కావాలనే తితిదేపై దుష్ప్రచారం చేస్తున్నారు: శ్రీకాంత్‌రెడ్డి srikanthreddy-comments-on-tirumala-controversy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5258004-188-5258004-1575381115408.jpg)
srikanthreddy-comments-on-tirumala-controversy
కావాలనే తితిదే పై దుష్ప్రచారం: శ్రీకాంత్ రెడ్డి
ఇదీ చదవండి : మహిళను కాపాడిన అర్జునరావుకు సీఎం అభినందనలు