ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అభివృద్ధి పనులు.. నమూనాల పరిశీలన - శ్రీకాళహస్తి లేటెస్ట్​ అప్​డేట్​

srikalahasti temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభివృద్ధి పనులపై ఈవో పెద్దిరాజును ద్రోణ ఆర్కిటెక్ కన్సల్టెన్సీ ఎండీ షికా జైన్ కలిశారు. అభివృద్ధి పనులు చేపట్టాల్సిన స్థలాల నమూనాలను పరిశీలించారు. ఈనెల 14న దేవాదాయ శాఖ కార్యదర్శితో సంస్థ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు తెలిపారు.

srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వర ఆలయం

By

Published : Feb 12, 2022, 1:38 PM IST

srikalahasti temple: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అభివృద్ధి పనులను వీలైనంత త్వరలో ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంపై ఆలయ ఈవో పెద్దిరాజును.. దిల్లీకి చెందిన ద్రోణ ఆర్కిటెక్ కన్సల్టెన్సీ ఎండీ షికా జైన్ కలిశారు. అభివృద్ధి పనులు చేపట్టాల్సిన స్థలాల నమూనాలను పరిశీలించారు.

ఈ నెల 14న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శితో సంస్థ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక బృందం అభివృద్ధి పనులు ప్రణాళికలపై నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు. దాదాపు రూ.150 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామని షికా జైన్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details