తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు వేడుకల్లో భాగంగా... శ్రీదేవి భూదేవి సమేతులైనశ్రీవారు తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ... శ్రీవారి పుష్కరిణికి వేంచేశారు. పుష్కరిణిలో ఏర్పాటుచేసిన తెప్పపై ఆశీనులైన స్వామి,అమ్మవార్లను పరిమళ భరిత పూల మాలలు, విశేష తిరువాభరణాలతో అర్చకులు అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారు పుష్కరిణిలో విహరించారు. వేడుకకువేలాదిగా వేంచేసిన భక్తజనం... స్వామివారి వైభవాన్ని తిలకించి ఆనందపరవశులై తన్మయత్వం పొందారు.