ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ రాధా దామోదర పూజ - తిరుమల వసంత మండపంలో విష్ణుపూజలు

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, శ్రీ రాధాకృష్ణులకు.. తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ శాస్త్రోక్తంగా జరిపారు. విష్ణుపూజా మంత్ర పఠనం, తిరువారాధనతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. ప్రత్యేక పూజానంతరం.. స్వామి, అమ్మవార్లకు నైవేద్యాలు, హారతులు అర్చకులు సమర్పించారు.

sri radha damodara pooja
శ్రీ రాధా దామోదర పూజ

By

Published : Nov 27, 2020, 6:40 PM IST

తిరుమల వసంత మండపంలో నిర్వహిస్తున్న ప్రత్యేక విష్ణుపూజల్లో భాగంగా.. శ్రీరాధా దామోద‌ర పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి సన్నిధి నుంచి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారిని, శ్రీ రాధాకృష్ణుల ఉత్సవ‌మూర్తుల‌ను.. వ‌సంత మండ‌పానికి తీసుకొచ్చారు. విష్ణుపూజా సంక‌ల్పం చేసి.. ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం గావించారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధ‌ను, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు, హార‌తులు స‌మ‌ర్పించారు.

విష్ణు పూజ

ప్రకృతి స్త్రీ స్వరూప‌మ‌ని, రాధా కృష్ణులు స‌క‌ల‌ సృష్టికి మూల‌కార‌కుల‌ని.. వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు మోహ‌న రంగాచార్యులు తెలిపారు. స‌మ‌స్త జీవ‌రాశులు క్షేమంగా ఉండేందుకు రాధా దామోద‌ర పూజను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details