శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - sri kapileswaraswamy hamsa vahanam news
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు హంస వాహనంపై స్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు హంస వాహనంపై కపిలేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కామాక్షి అమ్మవారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళ్తుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరించారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు.