కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కపిల తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు చేసిస్వామిని దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య మహాదేవునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ప్రత్యేకించి శివరాత్రి పర్వదినం కావటంతో స్వామికి నగర వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. కోలాటం, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారిని నగర ప్రజలు దర్శనం చేసుకున్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా తితిదే పూర్తి ఏర్పాట్లు చేసింది. సాయంత్రం కపిలేశ్వరునికి నందివాహనసేవను నిర్వహించనున్నారు.
కపిలతీర్థంలో రుద్రాభిషేకం - SIVARATH
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కపిల తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు.
శ్రీ కపిలేశ్వరస్వామికి రుద్రాభిషేకం