ఈనెల 23న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు(srivari Special Entry Darshanam tickets) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(ttd) అధికారులు వెల్లిడించారు. అక్టోబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు. రోజుకు 8 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.
ఈనెల 24 నుంచి సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని.. రోజుకు 8 వేల చొప్పున ఉచిత దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటు(ttd Darshan Tickets on online )లో ఉంచుతామన్నారు. ఈ క్రమంలో ఈనెల 23 నుంచి తిరుపతిలో సర్వదర్శన(sarvadarshana tickets) టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.