మూడో దశలోనే కాదు కొవిడ్ చికిత్స ఉన్నంతకాలం బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రభావం ఉంటుంది. ఎలాంటి అనుమానిత లక్షణాలు కన్పించినా రుయా ప్రభుత్వ ఆస్పత్రి ఈఎన్‌టీ ఓపీని ఆశ్రయించండి. కొవిడ్ కట్టడిలో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో త్వరగా ఫంగస్ విస్తరించడంతో సర్జరీ తప్పడం లేదు. రుయా ఆస్పత్రిలో సుమారు 300 మంది బ్లాక్ ఫంగస్‌తో ఆస్పత్రిలో చేరారు. అందులో 195 మందికి సర్జరీలు నిర్వహించడంతో కోలుకున్నారు. మొదట్లో సూది మందుల కొరత నెలకొన్నా..ప్రాధాన్యం మేరకు ఇచ్చాం. ప్రస్తుతం అవసరం మేరకు మందులను ప్రభుత్వం అందజేస్తోంది. ఎంఆర్‌ఐ సహా వైద్య పరీక్షలు, సర్జరీలు నిర్వహించడం.. ఖరీదైన మందులు మూడు నెలలకు ఉచితంగా ఇస్తున్నారు. ఇలాంటి ఉచిత సేవలను కాదని ప్రైవేటు ఆస్పత్రులను నమ్మి ఆర్థికంగా నష్టపోకండి. రుయాలో ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. కొవిడ్ తరహాలో బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదనే విషయాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుర్తించాలి. సొంత వైద్యం వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.- ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ వి.చంద్రశేఖర్
- వ్యాధి లక్షణాలు:
ముక్కులో చీము.. రక్తం కారడం, ముక్కు మూసుకుపోవడం, ముఖంలోని ఒకవైపు చెంప భాగం ఉబ్బడం, భరించరాని నొప్పి, తలనొప్పి, పళ్లు లూజు కావడం, స్పర్శ లేకపోవడం, కంటి చూపు కోల్పోవడం వంటి లక్షణాలు పోస్ట్ కొవిడ్ బాధితుల్లో కన్పిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలి.
- 173 మంది రోగులు: