దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ ల సమావేశం కోసం తిరుపతి ముస్తాబైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన(southern zonal council meeting at tirupati being attended by central home minister amit shah) 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ లు, ముఖ్య అధికారులు హాజరవుతారు.
ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్టానికి చేరుకుంటారు. రేపు జరగనున్న ఈ సమావేశంలో.. రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి సమస్యలపై చర్చించనున్నారు. మెుత్తంగా.. ఈ సమావేశంలో పాల్గొంటున్న రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరగనుంది.