జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ని రాష్ట్రానికి అధిపతి చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీలో ఉందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. పవన్‌కల్యాణ్‌కి సముచిత గౌరవం ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీయే చెప్పారని తెలిపారు. తిరుపతి ఎంపీ ఉపఎన్నికల వ్యూహంపై భాజపా, జనసేన నేతలు చర్చించారు.ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ఆచరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రానికి పవన్ కల్యాణ్ అధిపతి కావాలి: సోము వీర్రాజు - సోము వీర్రాజు వార్తలు
పవన్ కల్యాణ్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి అధిపతిగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కావాలని అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో భాజపా- జనసేన పార్టీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
![రాష్ట్రానికి పవన్ కల్యాణ్ అధిపతి కావాలి: సోము వీర్రాజు somu veerraju interesting comments pawan kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11197149-953-11197149-1616977691687.jpg)
సోము వీర్రాజు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు