తిరుమలలోని హథీరాంజీ మఠానికి సంబంధించిన బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయని మహంతు అర్జున్ దాస్ ఆరోపించారు. 108 గ్రాముల డాలర్‌తో పాటు మరికొన్ని నగలు కనిపినిపించటం లేదని బుధవారం మీడియాకు వెల్లడించారు. దేవదాయశాఖ అధికారులే ప్రస్తుతం మఠానికి చెందిన బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్నట్లు అర్జున్ దాస్ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని వెల్లడించారు. నగలు కాజేసిన వారిని శిక్షించాలన్నారు.
హథీరాంజీ మఠంలో బంగారు ఆభరణాలు మాయం: అర్జున్ దాస్
హథీరాంజీ మఠానికి సంబంధించిన బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయని మహంతు అర్జున్ దాస్ ఆరోపించారు. 108 గ్రాముల డాలర్‌తో పాటు మరికొన్ని నగలు కనిపినిపించటం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠంలో అధికారులు తనిఖీలు చేపడుతున్న వేళ ఆయన ఈ ఆరోపణలు గమనార్హం.
మరోవైపు తిరుమల, తిరుపతిలోని హథీరాంజీ మఠంలో దేవాదాయ శాఖ అధికారులు రెండోరోజూ(బుధవారం) తనిఖీలు చేపట్టారు. జులైలో మఠానికి సంబంధించిన బంగారు ఆభరణాల మాయమైనట్లు ఆరోపణలు రావటంతో దేవదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం నుంచి తిరుపతిపాటు తిరుమలలోని మఠంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. హథీరాంజీ మఠంలోని బంగారు, వెండి ఇతర ఆభరణాలు, విలువైన వస్తువులను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నారు. అధికారుల విచారణ కొనసాగుతున్న సమయంలో అర్జున్ దాస్ ఆరోపణలు చేయటం గమనార్హం.