ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో దుకాణంలోకి ప్రవేశించిన పాము.. కాసేపటికే.. - తిరుమల తాజా సమాచారం

తిరుమలలో ఓ పాము కలకలం రేపింది. ఓ దుకాణంలో ప్రవేశించిన పాము అందులో పని చేసే మహిళను కాటు వేసింది. వెంటనే మహిళా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి దుకాణ దారులు తిరుమల భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాములు పట్టే భాస్కర్ నాయుడిని పిలిపించి దానిని పట్టుకున్నారు.

snake entered into shop at tirumala
తిరుమలలో పాము కలకలం

By

Published : Jan 22, 2021, 9:16 PM IST

తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ మహిళను పాము కరిచింది. గాలి గోపురం వద్ద ఉన్న దుకాణంలోకి ప్రవేశించిన జెర్రిపోతు.. అక్కడే పనిచేసే మహిళను కాటు వేసింది. పాము కాటుగు గురైన మహిళ కేకలు వేయడంతో తోటి దుకాణ దారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తిరుమల భద్రతా సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే భాస్కర్ నాయుడిని పిలిపించి పట్టించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృహిళకు ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.

తిరుమలలో పాము కలకలం

ABOUT THE AUTHOR

...view details