ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2021, 10:57 PM IST

Updated : May 11, 2021, 2:22 PM IST

ETV Bharat / city

లైవ్​ అప్​డేట్స్​: రుయా ఆస్పత్రిలో మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం

14:21 May 11

రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం: సీఎం

రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం: సీఎం

కుటుంబాల వద్దకు వెళ్లి పరిహారం ఇవ్వండి: కలెక్టర్లతో సీఎం జగన్‌

అవినీతి, వివక్షకు తావులేకుండా రూ.87 వేల కోట్లు ఇవ్వగలిగాం: సీఎం

పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం: సీఎం

వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్ల ఖర్చుకు వెనకాడతామా?: సీఎం జగన్‌

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్‌ వెళ్లేలా చేయాలి: సీఎం

కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి మనకు ఆక్సిజన్‌ వస్తోంది: సీఎం

09:39 May 11

  • తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రిని పరిశీలించిన నేవీ డాక్‌యార్డు బృందం
  • విపత్తు నిర్వహణలో భాగంగా నిన్నటి ఘటనపై ఆరా తీసిన నేవీ బృందం
  • ఆక్సిజన్ పైపులైన్లు, సరఫరాను తనిఖీ చేసిన డాక్టర్ భన్సోడీ బృందం
  • రుయాలో ప్రాణవాయువు అందక నిన్న 11 మంది కరోనా రోగులు మృతి

09:39 May 11

  • తిరుపతి రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు
  • తమిళనాడు శ్రీపెరంబదూరు నుంచి వచ్చిన మరో ఆక్సిజన్ ట్యాంకర్
  • 10కేఎల్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి ఆక్సిజన్ నింపుతున్న సిబ్బంది
  • తిరుపతి: రోగులకు కొనసాగుతున్న అత్యవసర వైద్య సహాయం
  • తిరుపతి: మృతదేహాలను మార్చురీకి తరలించిన అధికారులు
  • తిరుపతి: మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చిన అధికారులు

09:39 May 11

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన గవర్నర్

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

00:09 May 11

రుయా ఆస్పత్రి మరణాలు జగన్ ప్రభుత్వ హత్యలే: లోకేశ్

11 మంది మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది: లోకేశ్‌

ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందడం బాధాకరం: లోకేశ్‌

00:09 May 11

పాలన చేతకాకపోతే జగన్‌ రాజీనామా చేయాలి: అచ్చెన్నాయుడు

చేతకాని పాలనతో ప్రాణాలు తీస్తున్న జగన్‌పై కేసు నమోదు చేయాలి: అచ్చెన్న

రుయా ఆస్పత్రిలో రోగులు మృతి చెందడం బాధాకరం: అచ్చెన్నాయుడు

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: అచ్చెన్నాయుడు

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్న

23:41 May 10

రుయా ఆస్పత్రి ఘటన చాలా బాధాకరం: భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి

రుయా ఘటనకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నాం: భాజపా నేత

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి: భానుప్రకాశ్‌రెడ్డి

23:32 May 10

గుంటూరు: తిరుపతి రుయా ఘటనపై హోంమంత్రి దిగ్భ్రాంతి

జరిగిన ఘటన హృదయాన్ని కలిచివేసింది: హోంమంత్రి సుచరిత

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి

ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు హోంమంత్రి ఆదేశాలు

హాస్పిటల్లో సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులకు హోం మంత్రి సుచరిత ఆదేశం

23:32 May 10

ఆక్సిజన్‌ సప్లైని బల్క్‌ సిలిండర్‌కు మార్చే క్రమంలో ఘటన జరిగింది: ఎస్పీ

ప్రెజర్‌ తగ్గడం వల్ల 11 మంది చనిపోయినట్లు నిర్ధరణ అయ్యింది: ఎస్పీ

ప్రస్తుతం మిగిలిన రోగుల పరిస్థితి నిలకడగానే ఉంది: ఎస్పీ

పూర్తిస్థాయి విచారణ జరిపాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం: ఎస్పీ వెంకట అప్పలనాయుడు

23:11 May 10

11 మంది మృతి

ఎస్వీఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో దాదాపు వెయ్యి మందికి చికిత్స జరుగుతోంది: కలెక్టర్‌

రాత్రి 8.30 గంటల సమయంలో ఆక్సిజన్‌ ప్రెజర్‌లో మార్పులు వచ్చాయి

ఆక్సిజన్‌ ప్రెజర్‌ తగ్గడం వల్ల కొందరు చనిపోయారు: కలెక్టర్‌

వెంటనే ఆక్సిజన్‌ను పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించాం: కలెక్టర్‌

ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు నిర్ధరణ అయ్యింది: కలెక్టర్‌

ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో 5 నిమిషాల ఆలస్యం జరిగింది: కలెక్టర్‌

ఎక్కడైతే తప్పు జరిగిందో తగిన విచారణ జరిపిస్తాం: కలెక్టర్‌


 

22:52 May 10

రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక రోగులు ఉక్కిరి బిక్కరి

తిరుపతి రుయా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్, అర్బన్‌ ఎస్పీ

రుయా ఆస్పత్రిలో పరిస్థితి సమీక్షిస్తున్న కలెక్టర్‌, అర్బన్ ఎస్పీ

22:52 May 10

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు: చంద్రబాబు
ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ అందించి రోగులను కాపాడాలి: చంద్రబాబు 

22:52 May 10

తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకుంటున్న రోగుల బంధువులు
తమ వారికి ఏం జరిగిందోననే ఆందోళనలో రోగుల బంధువులు
తిరుపతి: రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి 
అధికారికంగా ఇంకా ఏమీ తేల్చని వైద్యాధికారులు

22:52 May 10

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై సీఎం జగన్‌ ఆరా
రుయా ఆస్పత్రి ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం
తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం

22:48 May 10

రుయాలో ఉక్కిరిబిక్కిరి

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం
తిరుపతి: ఆక్సిజన్‌ అందక 11 మంది రోగుల పరిస్థితి విషమం 

తిరుపతి: బాధితులకు సీపీఆర్‌ నిర్వహిస్తున్న వైద్యులు

రుయా ఆస్పత్రి ఐసీయూలో దాదాపు 130 మంది రోగులు
ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావటంతో 25 నిమిషాలు నిలిచిన సరఫరా

శ్రీపెరంబూరు నుంచి ఆక్సిజన్ రవాణా ఆలస్యమైందన్న అధికారులు

ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకతో సరఫరా పునరుద్ధరించిన సాంకేతిక బృందం

తిరుపతి: రోగులకు ఆక్సిజన్‌ అందిస్తున్న వైద్య బృందం

Last Updated : May 11, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details