ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేధిస్తోన్న నిధుల కొరత..నత్తనడకన గరుడ వారధి పనులు - నత్తనడకన గరుడ వారధి పనులు తాజా వార్తలు

తిరుపతి నగరవాసులతో పాటు శ్రీవారి భక్తుల ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన గరుడ వారధి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. నిధుల కొరత కారణంగా...కొంత మేర మాత్రమే పనులు పూర్తిచేసి...వాహనాల రాకపోకలకు అనుమతిచ్చేలా నగరపాలక అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Slow running on Garuda bridge works
వేధిస్తోన్న నిధుల కొరత..నత్తనడకన గరుడ వారధి పనులు

By

Published : Jun 8, 2021, 9:59 PM IST

వేధిస్తోన్న నిధుల కొరత..నత్తనడకన గరుడ వారధి పనులు

తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి .."స్మార్ట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌" పేరుతో తిరుచానూరు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం సమీపంలోని నంది కూడలి వరకు గరుడ వారధి నిర్మాణాలు చేపట్టారు. తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌, తితిదే సంయుక్తంగా..684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 కిలోమీటర్ల మేర గరుడ వారధి నిర్మాణాలు చేపట్టేందుకు పూనుకున్నారు. వీటిలో తితిదే 458 కోట్లు, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ 226 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. తితిదే నిధుల కేటాయింపులో జాప్యం...గరుడ వారధి నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది.

బస్టాండ్‌ కూడలి నుంచి కపిలతీర్థం వరకు పనులు చివరి దశకు చేరగా.. మిగిలిన ప్రాంతంలో ప్రారంభ దశలో ఉన్నాయి. బస్టాండ్‌ నుంచి వాహనాల రాకపోకలను అనుమతించేందుకు వీలుగా పనులు పూర్తిచేసి...జులై చివరి నాటికి తొలి దశ గరుడ వారధిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

మార్కెట్‌ యార్డు నుంచి జాతీయ రహదారి వరకు, కపిలతీర్థం నుంచి అలిపిరి గరుడ కూడలి వరకు నిర్మాణాలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తితిదే ఛైర్మన్‌ ప్రకటించారు.

ఇదీచదవండి

'ప్రజల్ని విభజించి పాలిస్తున్న జగన్​రెడ్డి.. మూర్ఖమంత్రిగా నిలిచారు'

ABOUT THE AUTHOR

...view details