ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీలో మార్పులు - ttd latest news

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్ కేంద్రాలను మూసి వేయనున్నట్లు ప్రకటించింది.ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను 21న జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

TIRUMALA_TIME_SLOT_TOKENS
TIRUMALA_TIME_SLOT_TOKENS

By

Published : Dec 18, 2020, 10:44 PM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పు చేసింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కేంద్రాలను మూసి వేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను 21న జారీ చేయనున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన నేపథ్యంలో... మార్పు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబంధ‌న‌లు, గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ఏకాద‌శి స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఐదు ప్రాంతాల్లో జారీ చేయనుండటంతో ఏర్పాట్లలో భాగంగా మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి జనవరి మూడు వరకు తిరుపతిలోని ఐదు ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లను తీసుకోవచ్చని వెల్లడించారు. '

ఆధార్ ఆధారంగా టోకెన్లు జారీ...

తిరుపతి స్థానికులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను కేటాయించాలని నిర్ణయించిన తితిదే.... ఆధార్‌ కార్డుల ఆధారంగా లక్ష దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ఇతర ప్రాంతవాసులకు టొకెన్ల జారీ చేయకూడదని నిర్ణయించినట్లు తితిదే ప్రకటించింది.

తిరుచానూరు అమ్మవారి దర్శన సమయం పెంపు

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌న స‌మ‌యాన్ని గంట పాటు పొడిగిస్తూ తితిదే నిర్ణ‌యం తీసుకుంది. రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఉన్న అమ్మ‌వారి ద‌ర్శ‌న స‌మయాన్ని రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పొడిగించారు. కొవిడ్ నిబంధ‌న‌లు స‌డ‌లించిన అనంత‌రం జూన్ 8 నుంచి దర్శనాలు తిరిగి ప్రారంభించిన తితిదే... ఉద‌యం 7.30 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను ద‌ర్శనానికి అనుమ‌తించేవారు. కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, భ‌క్తుల సంఖ్య పెర‌గ‌ుతున్న నేపథ్యంలో రాత్రి 8.30 గంట‌ల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకొంది. ఎనిమిదిన్నర గంటల తర్వాత ఏకాంత సేవ నిర్వ‌హించి ఆలయాన్ని మూసివేయనున్నారు.

ఇదీ చదవండి

అనంతలో రెండు ప్రమాదాలు... ఐదుగురు మృతి...

ABOUT THE AUTHOR

...view details