ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరేళ్ల బాలుడు... మైక్రోసాఫ్ట్ పరీక్షలో పాసయ్యాడు.. !! - six years old boy qualified in microsoft office specialist exam

తిరుపతికి చెందిన ఆరేళ్ల బాలుడు రాజా అనిరుధ్‌ శ్రీరామ్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా! అనిపించాడు. కంప్యూటర్ సాధనపై ఆసక్తితో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా... మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు.

ఆరేళ్ల బాలుడు... మైక్రోసాఫ్ట్ పరీక్షలో పాసయ్యాడు.. !!
ఆరేళ్ల బాలుడు... మైక్రోసాఫ్ట్ పరీక్షలో పాసయ్యాడు.. !!

By

Published : Aug 30, 2021, 7:27 AM IST

తిరుపతి నగరానికి చెందిన సాకేత్‌ రామ్‌, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన అనిరుధ్ శ్రీరామ్... ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూనే, తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కంప్యూటర్‌పై సాధన చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎక్సెల్‌ షీట్‌ ఓపెన్‌ చేసి ఏ, బీ, సీ, డీ టైపు చేయడం ప్రారంభించాడు. గమనించిన తల్లిదండ్రులు అందులోని మెలకువలను నేర్పించారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్షకు అనిరుధ్‌ సిద్ధమయ్యాడు. నిరంతర సాధనతో స్కోరు క్రమంగా 1000కి 546 నుంచి 950కి మెరుగుపడింది.

మొదటి ప్రయత్నంగా ఆగస్టు 14న రాసిన పరీక్షలో విజయం సాధించలేకపోయాడు. రెండో ప్రయత్నంగా ఆగస్టు 21న పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. అనిరుధ్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌ పొందడంతో పాటు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఇందులో ఒడిశాకు చెందిన ఏడేళ్ల బాలుడి రికార్డును అనిరుధ్‌ అధిగమించడం విశేషం. అంతకుముందు ఈ బాలుడు 2019వ సంవత్సరంలో నాలుగేళ్ల వయసులో 160 సెకన్లలో 100 కార్లను గుర్తించే జ్ఞాపకశక్తితో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. రాకెట్‌పై స్పేస్‌కు వెళ్లడమే లక్ష్యమని ‘ఈనాడు-ఈటీవీ’తో చెప్పాడు.

ఇదీచదవండి.

RAINS : రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షం.. పలు ప్రాంతాల్లో భారీ కురిసే అవకాశం..

ABOUT THE AUTHOR

...view details