తిరుమల కొండపై ఆరడుగుల నాగుపాము కలకలం రేపింది. పాపవినాశనం దారిలోని ఉద్యాన వనంలో పడగవిప్పి బుసలుకొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తితిదే సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని పాముని చాకచక్యంగా పట్టుకున్నారు. తప్పించు కునేందుకు ప్రయత్నించగా... పాములను పట్టే యంత్రాలతో బంధించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆర్బీసెంటర్‌లో మరో సర్పం కనపడగా దాన్నీ పట్టుకున్నారు.
తిరుమల కొండపై ఆరడుగుల నాగపాము హల్చల్ - six feet
తిరుమల కొండపై ఆరడుగుల నాగుపాము పడగవిప్పి బుసలుకొడుతూ అందర్నీ హడలెత్తించింది.
తిరుమల కొండపై ఆరడుగుల నాగపాము హల్చల్