మూత్రపిండాల వ్యాధితో కొన్నాళ్లుగా బాధపడిన తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్.. చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి తిరుపతిలోని ఆయన స్వగృహానికి కుటుంబసభ్యులు తరలించారు. శివప్రసాద్ మృతిపై.. తెదేపా అధినేత చంద్రబాబు, సీఎం జగన్ , గవర్నర్ బిశ్వభూషణ్‌తో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. వారంలోపే మరో సీనియర్ నేత దివంగతులు కావడం.. తెదేపా శ్రేణులను విషాదంలో నింపింది.
చెన్నై నుంచి తిరుపతికి.. శివప్రసాద్ పార్థివదేహం తరలింపు - మాజీ ఎంపీ శివప్రసాద్
చెన్నై అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతిలోని ఆయన నివాసానికి తరలించారు.
శివప్రసాద్ పార్థివదేహాన్ని తిరుపతికి తరలిస్తోన్న కుటుంబసభ్యులు