ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆటో నడిపే మహిళల కోసం.. 'షీ' ఆటోస్టాండ్! - తిరుపతి లేటెస్ట్​ అప్​డేట్స్

She Auto Stands in Tirupati: ఆటోలు నడిపే మహిళల కోసం తిరుపతిలో "షీ" ఆటో స్టాండ్​ను ఏర్పాటు చేశారు ట్రాఫిక్​ పోలీసులు. తిరుపతి బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మహిళా ఆటో స్టాండ్​ను.. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు.

She Auto Stands in Tirupati
తిరుపతిలో షీ ఆటో స్టాండ్లు

By

Published : Apr 1, 2022, 5:31 PM IST

She Auto Stands in Tirupati: ఆటోలు నడుపుతున్న మహిళల కోసం తిరుపతి నగరంలో "షీ ఆటో స్టాండ్" పేరుతో.. ప్రత్యేకంగా ఆటో స్టాండ్​లను ట్రాఫిక్​ పోలీసులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్, పురపాలక సంఘ కార్యాలయం, ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాంతాల్లో ఈ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి బస్టాండ్ సమీపంలోని మహిళా ఆటో స్టాండ్​ను.. ఎస్పీ వెంకటప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఆటోలు నడుపుతున్న మహిళలను గౌరవించే లక్ష్యంతోనే "షీ ఆటో స్టాండ్లు" ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో మహిళలు ఆటో నడుపుతున్నారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు.

ఇదీ చదవండి: ప్రైవేటు బస్సులో 10 కిలోల బంగారం, 5.06 కోట్ల నగదు.. సీజ్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details