Sexually assault on Minor: తిరుపతి జిల్లా వెంకటగిరి బీసీ బాలుర వసతి గృహంలో బాలుడిపై లైంగిక దాడి కలకలం రేపింది. 8వ తరగతి బాలుడిపై అదే వసతి గృహంలోని 10వ తరగతి విద్యార్థి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో హాస్టల్ వాచ్‌మెన్‌ను నిలదీశారు. ఈ వసతి గృహంలో 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు మొత్తం 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Sexually assault on Minor boy: బాలుడిపై లైంగిక దాడి..! ఎక్కడంటే..? - తిరుపతి జిల్లాలో బాలుడిపై లైంగిక దాడి
Sexually assault on Minor boy: రాష్ట్రంలో రోజురోజుకు అమానవీయ, అరాచక ఘటనలు పెరిగిపోతున్నాయి. లైంగిక వేధింపులు, దాడులు ఆడపిల్లలపై కాదు మగవారిపైనా జరుగుతున్నాయి. కొందరు విద్యార్థులు.. తోటి విద్యార్థులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ వసతి గృహంలో బాలుడి మరో బాలుడి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలవరం సృష్టించింది.
sexual assault