78 హరియాణా మద్యం బాటిళ్లను ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, రైల్వే కోడూరుల్లో దాడులు నిర్వహించి.. ఈ సరుకును పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న.. హర్షవర్ధన్, ముక్తియార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నెహ్రూ నగర్లోని ఓ ఇంటిలో అధికారులు మద్యం సీసాలను గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారంతో కడప జిల్లా రైల్వే కోడూరులోని మరో వ్యక్తి నివాసంలో.. 74 బాటిళ్లతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.