ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటి పన్ను చెల్లింపునకు క్యూ కట్టిన జనం.. పనిచేయని సర్వర్లు

ఇంటి పన్ను చెల్లింపునకు జూన్ 30 ఆఖరి రోజు అయినందున తిరుపతిలో ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. ఒక్కసారిగా జనం పెద్దఎత్తున రావటంతో సర్వర్లు పనిచేయలేదు. దీంతో చాలామంది కట్టకుండానే వెనుదిరిగారు. జూన్ 30లోపు కడితే వచ్చే 5 శాతం రాయితీని కోల్పోవాల్సి వచ్చిందంటూ వాపోయారు.

By

Published : Jul 1, 2020, 11:12 AM IST

server-problem-for-paying-house-tax-in-tirupathi
ఇంటి పన్ను చెల్లింపునకు క్యూ కట్టిన జనం

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు జూన్ 30వ తేదీలోపు చెల్లించిన వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీని ప్రకటించింది. రాయితీ పొందేందుకు మంగళవారం ఆఖరి రోజు అయినందున ప్రజలు పన్ను చెల్లించేందుకు క్యూ కట్టారు. తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలోని లలిత కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పన్ను చెల్లింపు కౌంటర్లు కిటకిటలాడాయి.

ఆన్​లైన్, చెక్కు రూపంలో పన్ను చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ నగదు రూపంలో చెల్లించేందుకు ఆసక్తి చూపారు. దీంతో సర్వర్లు మొరాయించాయి. సర్వర్లు మొరాయించటంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. 5 శాతం రాయితీని కోల్పోవాల్సి వచ్చిందంటూ వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details