ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నందకం అతిధి గృహం లిఫ్ట్​లో ప్రమాదం..ఒకరికి తీవ్రగాయాలు - తిరుమల తాజా వార్తలు

లిప్ట్ నుంచి జారి కిందకు పడిపోవటంతో...ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన తిరుమల నందకం అతిథి గృహంలో జరిగింది.

Serious injuries to a person in a lift accident at tirumala
లిప్ట్ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

By

Published : Nov 11, 2020, 5:20 PM IST

తిరుమల నందకం అతిథి గృహంలో లిఫ్ట్ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. నందకంలోని అతిథి గృహంలోని లిఫ్ట్​లో ఆరుగురు భక్తులు కిందికి దిగుతుండగా కరెంట్ పోయింది. దీంతో భక్తులను బయటికి తీసేందుకు లిఫ్ట్ ఆపరేటర్ తలుపులను తెరవగా...ఐదుగురు భక్తులు సురక్షితంగా బయటికి వచ్చేశారు. నెల్లూరు జిల్లా వెంకటిగిరికి చెందిన జయప్రకాశ్ శెట్టి అనే భక్తుడు పొరపాటున కాలి జారి కిందకు పడిపోవటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details