రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన ఆయన నేరుగా తిరుచానూరు చేరుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే అధికారులు.. ఆయనకు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఈసీ రమేశ్ కుమార్ - sri padmavathi Ammavari temple
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు స్వాగతం పలికిన తితిదే అధికారులు.. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఈసీ రమేశ్ కుమార్