తిరుమల రెండవ కనుమ దారిలో వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం - చిత్తూరులో రోడ్డు యాక్సిడెంట్
శ్రీవారిని దర్శించుకునేందుకు కర్ణాటకకు చెందిన భక్తులతో వెళ్తున్న స్కార్పియో వాహనం తిరుమల రెండవ కనుమదారిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
తిరుమల రెండవ కనుమ దారిలో స్కార్పియో వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం
తిరుమల రెండవ కనుమ దారిలో స్కార్పియో వాహనం బోల్తా పడింది. శ్రీవారి దర్శనార్థం కర్ణాటకకు చెందిన భక్తులు తిరుమలకు బయలుదేరారు. 12వ కిలోమీటరు మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.