SC on collectorate at padmavathi nilayam: తితిదేకు చెందిన పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై.. జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే కు.. జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. తాత్కాలికంగా కలెక్టరేట్ ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు - padmavathi nilayam as collectorate of sri balaji district news
SC on collectorate at padmavathi nilayam: తితిదేకు చెందిన పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై.. జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై జోక్యానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
సుప్రీంకు వెళ్లిన భానుప్రకాశ్‌రెడ్డి..తిరుపతి పద్మావతి నిలయంలో కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటంపై భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటు వద్దని హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి స్టేపై ప్రభుత్వం ధర్మాసనంలో అప్పీల్‌కు వెళ్లింది. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసన కొట్టివేసింది. దీంతో హైకోర్టు బెంచ్ ఉత్తర్వులపై భాను ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news