ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో రోజా, సమంత - రోజా సమంత తాజా వార్తలు

ఎమ్మల్యే రోజా, సినీ నటి సమంత తిరుమల దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Sep 18, 2021, 9:30 AM IST

Updated : Sep 18, 2021, 12:39 PM IST

తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న సమంత... శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఓట్ల లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి: సీఎస్‌

Last Updated : Sep 18, 2021, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details