ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోవిందుడి ఆస్తుల అమ్మకంపై గొడవ గొడవ - టీటీడీ ఆస్తుల అమ్మకం తాజా వార్తలు

తిరుమల శ్రీవారి స్థిరాస్థులను విక్రయించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం-తితిదే నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరర్ధక ఆస్తుల పేరుతో స్వామి స్థిరాస్థినే విక్రయించడానికి తితిదే మొగ్గు చూపుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ఈవోలు, బోర్డు సభ్యులు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం తితిదే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

sale of  tirumala tirupathi devasthanam assets  issue
sale of tirumala tirupathi devasthanam assets issue

By

Published : May 25, 2020, 8:14 PM IST

Updated : May 25, 2020, 11:32 PM IST

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన స్థిరాస్థులను తితిదే అమ్మకానికి పెట్టింది. వీటిని నిర్వహించడం కష్టతరమవుతోందన్న కారణంతో..దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉన్న స్థలాలు, పొలాలను అమ్మాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా తితిదే నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా.. నిరర్థక ఆస్తుల పేరుతో తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు చూపుతోంది. తమిళనాడులోని 23 ఆస్తులతో పాటు.. భవిష్యత్తులో మరిన్ని ఆస్తులను అమ్మేందుకు జాబితాను సిద్ధం చేస్తోంది. తితిదే శనివారం విడుదల చేసిన ప్రకటన మేరకు ఇప్పటి వరకు విక్రయించడానికి గుర్తించిన ఆస్తుల విలువ రూ.23.92 కోట్లుగా లెక్కగట్టారు. వాస్తవానికి తితిదే బడ్జెట్‌లో నిరర్థక ఆస్తుల విక్రయం ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పొందుపర్చింది. ఈ అంచనాలను బట్టి ఇప్పటికే గుర్తించిన భూములే కాకుండా దేశవ్యాప్తంగా దాతలు తిరుమల వెంకన్న స్వామికి ఇచ్చిన ఆస్తులను భవిష్యత్తులో విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

  • నగర ప్రాంతాల్లోనూ..

గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములే కాకుండా నగర పరిధిలోని విలువైన స్థలాలు వేలం వేసేందుకు తితిదే సిద్ధమవుతోంది. గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల్లోని దేవాలయ స్థలాలు, ఇంటి స్థలాలతో పాటు, అపార్ట్​మెంట్లు నాందేడ్‌, బెంగళూరు నగరాల్లోనూ కొన్ని ఆస్తులు అమ్మకానికి సిద్ధం చేసిన జాబితాలో ఉన్నాయి.

  • తీవ్ర వ్యతిరేకత

టీడీడీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఎంపీలు, టీటీడీ మాజీ ఈవోలు, బోర్డు సభ్యులు, ఆధ్యాత్మికవేత్తలు, తమ నిరసనగళం వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలని బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, రాజ్యసభ సభ్యుడు రాకేష్ సిన్హా ..టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాశారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రాకేష్ సిన్హా కోరారు.

శ్రీవారి ఆస్తుల అమ్మకాలను ఆపాలి. ఆస్తులన్నీ శ్రీవారికి భక్తులు ఇచ్చిన విరాళాలు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమైనందున నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి

శ్రీవారి ఆస్తుల అమ్మకాలను ఆపాలి

టీటీడీ నిర్ణయం అసంబద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, టీటీడీ మాజీఈవో ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు.

టీటీడీ నిర్ణయం సహేతుకంగా లేదు. దాతలు స్వామివారి కోసం ఇచ్చిన ఆస్తులను అమ్మే హక్కు పాలకమండలికి లేదు. ఆస్తులు కాపాడలేము కాబట్టి అమ్మేస్తాం అంటే ఎలా..? టీటీడీకి చెన్నై, ఢిల్లీ వంటి చోట్ల డిప్యూటీ ఈవో స్థాయి అధికారులు ఉన్నారు. వాళ్ల పని ఆస్తులు కాపాడటమే. టీటీడీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలి. రాజకీయ, వ్యాపార నేపధ్యం ఉన్న వాళ్లని తొలగించాలి.

టీటీడీ నిర్ణయం సహేతుకంగా లేదు.

తితిదే ఆస్తుల విక్రయంపై ఈ నెల 28న జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో ఓటింగ్ పెట్టాలని.... పాలకమండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్

చేశారు.

దేవుడి ఆస్తులను అమ్ముతున్నారని ఇంతకుముందు ప్రభుత్వంపై ప్రస్తుత టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలోని బోర్డు స్థలాల అమ్మకానికి ఎలా నిర్ణయం తీసుకుంది..? బోర్డు సభ్యుల్లోనే చాలా మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఓటింగ్ జరపాలి.

బోర్డు సమావేశంలో ఓటింగ్ జరపాలి
  • తప్పు చేయడం లేదు: టీటీడీ

టీటీడీ ఆస్తులను తాము విక్రయించేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సరికాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.


టీటీడీ ఆస్థులను అమ్మాలని 2016లోనే నిర్ణయించారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారే అప్పుడు బోర్డు సభ్యులుగా ఉన్నారు. స్వామికి చాలా ఆస్తులున్నాయి. స్వామివారి స్థిరాస్తులు ఆమ్మాలన్నది మా ఉద్దేశం కాదు. నిరర్థకంగా ఉన్న వాటినే విక్రయించాలనుకుంటున్నాం. దీనిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 28న జరిగే పాలకమండలి సమావేశంలో సమీక్షిస్తాం.

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

టీటీడీ నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేగింది. ఎంపీలు రఘురామకృష్ణంరాజు, జీవీఎల్ నరసింహరావు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనిపై రాజకీయ పోరాటం చేస్తామన్నారు. భక్తులు స్వామికి భక్తితో సమర్పించిన ఆస్తులను విక్రయించడం వారిని అవమానించడమేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

2016 జనవరి 30 తేదీన తితిదే బోర్డు 50 ఆస్తులను విక్రయానికి తీసుకున్న 253 తీర్మానాన్ని.. నిలుపుదల చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలన చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు 50 స్థలాల విక్రయ ప్రతిపాదన తీర్మానం నిలిపివేస్తున్నట్టు ఆదేశాల్లో తెలిపింది

.

Last Updated : May 25, 2020, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details