ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో శ్రీ భాష్యకారుల శాత్తుమొర వేడుక - chitoor news

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భాష్యకారుల శాత్తుమొర వేడుక జరిగింది. ఏప్రిల్ 9న ప్రారంభమైన భాష్యకారుల ఉత్స‌వాలు 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగనున్నాయి.

saattumora fest
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భాష్యకారుల సాత్తుమొర వేడుక

By

Published : Apr 19, 2021, 6:11 AM IST

శ్రీ రామానుజులవారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్ర‌తి ఏటా శ్రీ‌వారి ఆల‌యంలో భాష్యకార్ల శాత్తుమొరను తితిదే నిర్వహిస్తోంది. ఆదివారం రామానుజుల తిరునక్షత్రం సందర్భంగా సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు వైభ‌వోత్స‌వ మండ‌పంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ భాష్యకార్లవారికి విశేష స‌మ‌ర్ప‌ణ చేశారు.

సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీ భాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహించారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details