ఎన్ని రాళ్లని ఒకదానిమీద ఒకటి పేరిస్తే... అన్ని అంతస్తుల ఇల్లు కట్టుకుంటామనీ... లేదా పడిపోకుండా వీటిలా నిలబెడితే కోరుకున్న కోర్కెలు తీరతాయనీ నమ్ముతుంటారు. అయితే... అలాంటి రాళ్ల వరసలే రష్యాలోని కేప్ వ్యాట్లినా బీచ్ దగ్గరా కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. 2015లో ఆ ప్రాంతపు 155వ వార్షికోత్సవం సందర్భంగా... కొందరు పర్యావరణ ప్రేమికులు ఇలాంటి 155 రాళ్ల వరసల్ని పేర్చారట.
రష్యాలోనూ రాళ్ల స్తూపాలు... అచ్చం మనలాగే..!
తిరుమల కొండ ఎక్కేటప్పుడు పక్కన చిన్నచిన్న రాళ్లు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉండటం... గమనించే ఉంటారు. వాటిని చూసి మిగతా వాళ్లు కూడా అలాగే పేరుస్తుంటారు. అచ్చం ఇలానే రష్యాలోనూ పేరుస్తారు తెలుసా..!
russian culture like india
ఆ తర్వాత నుంచి అక్కడికి వచ్చిన పర్యటకులూ... ఇలా పేర్చడం మొదలుపెట్టారు. దీంతో ఆ ఒడ్డు నిండా ఇలాంటి స్తూపాలే కనిపిస్తాయి. ఇలా చేస్తే మనం కోరుకున్న కోరిక తీరుతుందని... మనలాగే అక్కడివాళ్లూ నమ్ముతారట. చాలా ఏకాగ్రతతో చేస్తే కానీ ఈ పని పూర్తవ్వదు కనుక ఇదో సరదా అంటారు వీటిని పేర్చే కొందరు. ఏది ఏమైనా మన రాళ్ల స్తూపాలు అక్కడా ఉండటం ఆశ్చర్యమే కదా..!
ఇదీ చదవండి:చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..!
Last Updated : Nov 24, 2019, 9:44 AM IST