ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RUIA INCIDENT: కరోనా రోగుల మృతి ఘటనపై రుయా ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు - death of corona patients in RUIA

ruya
ruya

By

Published : Jul 23, 2021, 10:04 PM IST

Updated : Jul 23, 2021, 10:50 PM IST

21:59 July 23

RUIA INCIDENT

తిరుపతిలో ఆక్సిజన్‌ కొరతతో 23 మంది కరోనా రోగుల మృతి చెందిన ఘటనపై రుయా ఆస్పత్రి యాజమాన్యం అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా చేయకపోవడంతోనే మరణించారని పేర్కొంది. కర్నూలుకు చెందిన భారత్‌ ఫార్మా, ఆక్సిజన్‌ పంపిణీదారులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఏం జరిగిందంటే..

              మే10వ తేదిన తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రాణవాయువు అందక 23 మంది కరోనా రోగుల మృత్యువాత పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ నిల్వ ఉన్న ట్యాంకు ఖాళీ అయింది. వార్డుల్లోని రోగులకు ప్రాణవాయువు సరఫరా ఆగిపోయి, పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. బాధితుల సహాయకులు వైద్యులకు సమాచారమిచ్చారు. ఈలోపు ఆస్పత్రి ఆవరణలో ఉన్న బంధువులు తమవారి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే రోగులు ఒకొక్కరుగా మరణించసాగారు.  రాత్రి 9 గంటల సమయానికి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరాను పునరుద్ధరించారు. ఈలోపే వార్డుల్లో గందరగోళం, సహాయకుల ఆగ్రహావేశాలతో...వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. సుమారు 30 నిమిషాల వరకు ఆక్సిజన్ సరఫరా నామమాత్రంగానే జరిగిందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. ఆ తర్వాత ఆక్సిజన్ సరఫరా అయినా...అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. రాత్రి 8 గంటలకు ఘటన జరగ్గా...పదిన్నర గంటల సమయంలో అధికారులు అక్కడికి వచ్చారు.  

   ప్రాణ వాయువు సరఫరా కోసం తమిళనాడులోని శ్రీపెరంబదూరుకు చెందిన లిండే సంస్థతో మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్యాంకుల్లో ఆక్సిజన్ స్థాయి 50 శాతం తగ్గిన వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం నేరుగా వారికి చేరిపోతుంది. అందుకు అనుగుణంగా ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరి వస్తుంది. శ్రీపెరంబదూరు నుంచి తిరుపతి దాదాపు 130 కిలోమీటర్ల దూరం కాగా...నిబంధనల మేరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడున్నర గంటల్లోనే ఆక్సిజన్ ట్యాంక్ చేరుకోగలదు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకే ట్యాంకర్ చేరుకోవాల్సి ఉన్నా...అలా జరగలేదు. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రుయా ఆస్పత్రి యాజమాన్యం ఆరోపించింది.  

ఇదీ చదవండీ..పిల్లలు దివ్యాంగులని రెండో పెళ్లి చేసుకున్నాడు.. అంతలోనే మరో ట్విస్ట్!

Last Updated : Jul 23, 2021, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details