తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందిన ఘటనపై... హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. రుయా విషాద ఘటనలో మరణించిన వారి సంఖ్య... ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎక్కువే ఉంటుందని భాజపా మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. ఇదే అంశంపై తమ దగ్గరున్న ఆధారాలతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామన్న భానుప్రకాష్ రెడ్డి... ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో కేవలం 11 మంది మరణించినట్లు అధికారులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మృతులకు... 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భానుప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రుయా ఘటన: 'హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి' - Bhanuprakash reddy comments on Rua incident
తిరుపతి రుయా ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మృతులకు... 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భానుప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి