RRR: నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. రైతుల సభలో పాల్గొనేందుకు వచ్చిన రఘురామకృష్ణ రాజుకు.. ఎయిర్ పోర్టులో అమరావతి జేఏసీ నేతలు ఘనస్వాగతం పలికారు. జై అమరావతి జయహో అమరావతి నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అమరావతి రైతుల సభ జరిగే ప్రాంతమైన దామినేడుకు వెళ్లారు.
ఈ సభ గురించి మాట్లాడుతూ.. ఇది రాజకీయ సభ కాదన్న ఎంపీ రఘురామకృష్ణరాజు.. దగాపడ్డ రైతుల సభ అని అన్నారు. రైతులకు మద్దతు కోసం అన్నివర్గాలూ తరలివస్తున్నాయని తెలిపారు. ఈ సభ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని అన్నారు.