జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరూరు పంచాయతీ బండ వద్దనున్న జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
నకిలీ ఖాకీలు వసూళ్లు చేస్తుండగా.. నిజమైన మామలు వచ్చేశారు! - tirupathi latest news
సులువుగా డబ్బు సంపాదించడం కోసం జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
పోలీసులమంటూ బెదిరించి నగలు, డబ్బు వసూలు చేస్తున్నట్లు డీఎస్పీ నరసప్ప చెప్పారు. జాతీయ రహదారిపై ఇప్పటి వరకు నాలుగు సంఘటనలు జరిగాయని.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసిన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.35,000, 61 గ్రాముల బంగారం, ఓ ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండి:Murder: కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్య!