ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2022, 8:48 PM IST

ETV Bharat / city

రుయా ఘటనపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ: మంత్రి రోజా

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రోజా తెలిపారు. ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ వేశామన్న మంత్రి.. ఆ కమిటీలో డీఎంహెచ్​వో, సూపరింటెండెంట్, ఆర్డీవోలు ఉన్నారన్నారు.

రుయా ఘటనపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ
రుయా ఘటనపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ

రుయా ఘటనపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రోజా తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ వేశామన్న మంత్రి.. ఆ కమిటీలో డీఎంహెచ్​వో, సూపరింటెండెంట్, ఆర్డీవోలు ఉన్నారన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ని ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు.

పర్యటక రంగానికి పెద్దపీట: గతంలో జరిగిన ఒక బోటు ప్రమాదం వల్ల పర్యాటకులకు ఇబ్బంది పడ్డారని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకున్నామని పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. విజయవాడ కృష్ణా నదిలో బోధిసిరి బోటును మంత్రి పునఃప్రారంభించారు. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని.., పర్యాటకానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఏపీ పర్యాటకానికి సంబంధించి 45 ప్రభుత్వ బోట్లు, 25 ప్రైవేటు బోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తొమ్మిది ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్​ల ద్వారా బోట్లని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పాపికొండలకు బోటింగ్​ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రోప్​ వేస్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ వెల్లడించారు. రెండు రోప్​ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details