ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలు చేయడానికి నిర్ణయించారు. ఆనందయ్య ఔషధంపై సీసీఆర్ఏఎస్‌కు సమాంతరంగా తితిదే పరీక్షలు నిర్వహించనుంది. టాక్సిక్ స్టడీ, క్లినికల్ ట్రయల్స్ చేయనున్నట్లు తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు జరపనున్నట్లు స్పష్టం చేశారు. 15-20 రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. జంతువులపై కూడా పరిశోధనలు జరపనున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఆనందయ్య ఔషధంపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయం
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తితిదే ఆధ్వర్యంలో పరిశోధనలకు నిర్ణయించారు. టాక్సిక్ స్టడీ, క్లినికల్ ట్రయల్స్ చేయనున్నట్లు తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. 15-20 రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు
research on anandhayya medicine under TTD