ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ​ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోండి.. వెంకయ్యనాయుడికి గ్రామస్థుల వినతి - railway news

కరోనాకు ముందువరకు ఆ ప్రాంతంలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేవి. ప్రస్తుతం అక్కడ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఆపడం లేదు. ఆ ప్రాంత ప్రజలు అనేకసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

వెంకయ్య నాయుడుకి వినతి పత్రం
Request to Ex Vice President

By

Published : Oct 4, 2022, 8:32 PM IST

కరోనకు ముందు ఆ ప్రాంతంలో కృష్ణా, పూరి, తిరుమల, మచిలీపట్నం ఎక్సప్రెస్ రైళ్లు ఆగేవి. కరోనా అనంతరం పరిమాణాలు మారిపోయాయి. గతంలో మాదిరిగా అక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేయడం లేదు. ఆ ప్రాంత ప్రజలు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జాయంపులోని వెందొడు రైల్వే స్టేషన్​లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేయించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పర్యటనలో వెంకటగిరి బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. స్పందించిన వెంకయ్య నాయుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details