ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల - తిరుమల బ్రహ్మోత్సవాలపై వార్తలు

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించిన ప్రత్యేక కోటాను ప్రకటించింది. రోజుకు 16 వేల టిక్కెట్లను 15 స్లాట్‌లలో అందుబాటులో ఉంచింది.

Release of Srivari Special Admission Darshan Tickets
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల

By

Published : Oct 9, 2020, 11:27 AM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వాహన సేవలను తిరువీధుల్లో నిర్వహించి.... పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. తితిదే వెబ్‌సైట్‌ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది.

ఉత్సవాలు జరిగే రోజులకు సంబంధించి ప్రత్యేక కోటాను విడుదల చేశారు. రోజుకు 16 వేల టిక్కెట్లను 15 స్లాట్‌లలో అందుబాటులో ఉంచింది. టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి తనిఖీ కేంద్రంలో పరిశీలించి కొండపైకి అనుమతిస్తారు. శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు... తిరుమాఢ వీధుల్లో నిర్వహించే వాహన సేవలలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

ఇదీ చదవండి: న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details