ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమంగా ఎర్ర చందనం తరలింపు..ముగ్గురు స్మగ్లర్లు పట్టివేత

అక్రమంగా ఎర్ర చందనంను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ప్రత్యేక కార్యదళ సిబ్బంది అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 5 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

red sandal smugglers are arrested
ఎర్ర చందనం పట్టివేత

By

Published : Oct 6, 2020, 11:14 AM IST

ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం సిబ్బంది అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో తిరుచానూరు - చంద్రగిరి రహదారి సమీపంలోని ఎమ్మార్​పల్లి ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఎర్ర చందనం డంపింగ్ ఉందనే సమాచారంతో అధికారులు ఈ ప్రదేశాన్ని తనిఖీ చేశారు.

ఆటోలో ఎర్ర చందనం దుంగలు ఎక్కిస్తుండగా కార్యదళం సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. నిందితులను భాకరాపేటకు చెందిన సాయికుమార్, శివారెడ్డి, దిలీప్ కుమార్​గా గుర్తించారు. వీరి నుంచి 5 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండీ...యూపీ పోలీసులు కరుణామయులు!

ABOUT THE AUTHOR

...view details