సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత...తిరుపతి నుంచి రైల్వే సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రాయలసీమ ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు. మొత్తం 815 మంది ప్రయాణికులు ఈ రైలు ద్వారా ప్రయాణం చేస్తుండగా....వారిని పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాత అధికారులు ప్రయాణానికి అనుమతించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ అనంతరమే ప్రయాణికులు ప్లాట్ ఫాంపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో ప్రారంభమైన ఈ ప్రత్యేక రైలు సర్వీసుపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
తిరుపతిలో రైల్వే సర్వీసులు పున:ప్రారంభం
కరోనా వ్యాప్తితో ఇన్నిరోజులు నిలిచిపోయిన రైల్వే సర్వీసులు తిరుపతిలో పున:ప్రారంభమయ్యాయి. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రాయలసీమ ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు.
తిరుపతిలో రైల్వే సర్వీసులు పున:ప్రారంభం