Rathasapthami at Tirumala : తిరుమల శ్రీనివాసుని ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను మొదటిసారిగా ఏకాంతంగా నిర్వహించేందుకు తితిదే నిర్ణయించింది.కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ప్రతీ ఏటా రథసప్తమి నాడు శ్రీవారికి ఏడు ప్రధాన వాహన సేవలు జరుగుతాయి.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ రథసప్తమి రోజున జరిగే ఏడు ప్రధాన వాహన సేవలను శ్రీవారి అంతరాలయంలోని కల్యాణమండపం, రంగనాయకుల మండపంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలోనే తితిదే అధికారులు, బోర్డు సభ్యులను అనుమతించనున్నట్లు సమాచారం. దర్శన టికెట్లు ఉన్న భక్తులనే తిరుమలకు అనుమతిస్తారు. వారికి కూడా ఆలయంలో ఏకాంతంగా జరిగే వాహనసేవలను దర్శించే భాగ్యం ఉండదు.