ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు - ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు న్యూస్

తిరుమలలో రథ సప్తమి వేడుకలు ఫిబ్రవరి 19న ఘనంగా జరగనున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభం కానున్న వాహన సేవలు రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తాయి. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.

ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు
ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు

By

Published : Jan 18, 2021, 10:49 PM IST

ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి ఒకే రోజు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభం కానున్న వాహన సేవలు రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తాయి. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు

  • సూర్యప్రభ వాహనం ఉదయం 5.30 నుంచి 8.00 వరకు
  • చిన్నశేష వాహనం ఉదయం 9.00 నుంచి 10.00 వరకు
  • గరుడ వాహనం ఉదయం 11.00 నుంచి 12.00 వరకు
  • హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 వరకు
  • చక్రస్నానం మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు
  • కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 నుంచి 5.00 వరకు
  • సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 నుంచి 7.00 వరకు
  • చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 నుంచి 9.00 వరకు

ABOUT THE AUTHOR

...view details