రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు... అన్ని శాఖల్లో పొదుపును పాటిస్తున్నట్లు శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రాజన్నదొర తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో తితిదే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. తితిదే ఆదాయవ్యయాలపై చర్చించారు. భక్తులు స్వామివారికి సమర్పిస్తున్న కానుకలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఆదా చేయాలని అంచనాల కమిటీ సూచించిందన్న ఆయన... అన్నిచోట్ల తితిదే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
'పొదుపును పాటిద్దాం.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుద్దాం' - తితిదే అధికారులతో రాజన్నదొర సమీక్ష
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు... అన్ని శాఖల్లో పొదుపును పాటిస్తున్నట్లు శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రాజన్నదొర తెలిపారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని... అదనపు ఖర్చులను నియంత్రించాలని తితిదే అధికారులను కోరారు.
!['పొదుపును పాటిద్దాం.. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుద్దాం' rajanna dora review with ttd officers in tirupathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5192557-976-5192557-1574851130357.jpg)
రాజన్నదొర